జగన్ బెయిలు రద్దు చేయండి: సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్

  • జగన్ పై సీబీఐ 11 ఛార్జ్ షీట్లు వేసింది
  • అన్ని ఛార్జ్ షీట్లలో జగన్ ఏ-1గా ఉన్నారు
  • కేసుల విచారణను త్వరగా పూర్తి చేయండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. జగన్ బెయిలు రద్దు చేయాలని ఆ పిటిషన్ లో కోరారు. పిటిషన్ తో పాటు పలు పత్రాలను కోర్టుకు ఆయన సమర్పించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ పై సీబీఐ 11 ఛార్జ్ షీట్లను నమోదు చేసిందని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. అన్ని ఛార్జ్ షీట్లలో ఆయన ఏ-1గా ఉన్నారని తెలిపారు. జగన్ కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా, తమ పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే తాను పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు.

Raghu Rama Krishna Raju
Jagan
CBI Court
Case

More Telugu News